:

2 Corinthians 3

1

మమ్మును మేమే తిరిగి మెప్పించుకొన మొదలు పెట్టుచున్నామా? కొందరికి కావలసినట్టు మీ యొద్దకైనను మీ యొద్ద నుండియైనను సిఫారసు పత్రికలు మాకవసరమా?

2

"మా హృదయముల మీద వ్రాయబడియుండి, మనుష్యులందరు తెలిసికొనుచు చదువు కొనుచున్న మా పత్రిక మీరే కారా?"

3

"రాతి పలక మీద గాని సిరాతో గాని వ్రాయబడక, మెత్తని హృదయములు అను పలకల మీద జీవముగల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికయై యున్నారని మీరు తేటపరచబడుచున్నారు."

4

క్రీస్తు ద్వారా దేవుని యెడల మాకిట్టి నమ్మకము కలదు.

5

మా వలన ఏదైనా అయినట్టుగా ఆలోచించుటకు మాయంతట మేమే సమర్ధులమని కాదు; మా సామర్థ్యము దేవుని వలననే కలిగి యున్నది.

6

"ఆయనే మమ్మును క్రొత్తనిబంధనకు, అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులమగుటకు మాకు సామర్ధ్యము కలిగించి యున్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపజేయును."

7

"మరణ కారణమగు పరిచర్య, రాళ్ళమీద చెక్కబడిన అక్షరములకు సంబంధించిన దైనను, మహిమతో కూడిన దాయెను. అందుకే మోషే ముఖము మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవునదైనను, ఇశ్రాయేలీయులు అతని ముఖము తేరి చూడ లేకపోయిరి."

8

ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమగలదై యుండును ?

9

శిక్షావిధికి కారణమైన పరిచర్యయే మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలదగును.

10

అత్యధికమైన మహిమ దీని కుండుట వలన ఇంతకు ముందు మహిమగలదిగా చేయబడినది ఈ విషయములో మహిమ లేనిదాయెను.

11

"తగ్గిపోవునదే మహిమగలదై యుండిన యెడల, నిలుచునది మరి ఎక్కువ మహిమగలదై యుండును గదా?"

12

తగ్గిపోవుచున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలీయులు తేరి చూడ కుండునట్లు మోషే తన ముఖము మీద ముసుగు వేసుకొనెను.

13

"మేము అట్లుచేయక ఇట్టి నిరీక్షణ గలవారమై, బహు ధైర్యముగా మాటలాడుచున్నాము."

14

"మరియు వారి మనస్సులు కఠినములాయెను గనుక నేటి వరకును పాత నిబంధన చదువబడునప్పుడు, అది క్రీస్తునందు కొట్టివేయబడెనని వారికి తేటపరచబడక, ఆ ముసుగే నిలిచియున్నది."

15

నేటి వరకును మోషే గ్రంథము వారు చదువునప్పుడెల్ల ముసుగు వారి హృదయము మీద నున్నది గాని.

16

వారి హృదయము ప్రభువు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును.

17

ప్రభువే ఆత్మ. ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడనుండునో అక్కడ స్వాతంత్య్రము నుండును.

18

"మన మందరమును ముసుగు లేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు, ప్రభువగు ఆత్మ చేత ఆ పోలిక గానే మార్చబడుచున్నాము."

Link: